టీడీపీ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం
posted on Nov 2, 2012 10:32AM
.jpg)
తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రం నాయుడు తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విశాఖలోని ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి వద్ద పెట్రోల్ ట్యాంక్ ను ఎర్రం నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో షాక్ కు గురై కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను వెంటనే హైవే అంబులెన్స్ లో కిమ్స్ శాయి శేషాద్రి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు.
ప్రమాదంలో జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు చౌదరి బాబ్జి ఇంకా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎర్రం నాయుడు మృత దేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యింది. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచుతారు. నేడు ఆయన స్వంత గ్రామంలో అత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.