అమెరికాలో నెల్లూరు యువతి ఆత్మహత్య
posted on Nov 3, 2012 10:09AM

అమెరికాలో భర్త వేధింపులు భరించలేక నెల్లూరు జిల్లా యువతి అత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి వార్త తెలుసుకుని బుచ్చిరెడ్డిపాళెంలో విషాదం అలుముకుంది. సరిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బ్యాంక్ ఉద్యోగి మునగాల శ్రీనివాసులురెడ్డి మూడో సంతానం సరిత (21). వారణాసిలో ఎంటెక్ చదివిన సరితకు హైదరాబాద్‌కు చెందిన అన్నపురెడ్డి సుధీర్‌రెడ్డితో వివాహమైంది.
మొదట సుధీర్ అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత సరితకు వీసా రావడంతో ఆమె కూడా అమెరికా వెళ్లింది. భర్తకు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసి నిలదీయగా వేధింపులు అధికమయ్యాయి. దాంతో కలత చెందిన సరిత ఉరి వేసుకుని ప్రాణాలు వదిలింది. అంతకుముందే ఈ మెయిల్‌లో తండ్రికి ఈ సమాచారం పంపింది. కానీ, సుధీర్‌రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, సరిత మృతిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆమె తండ్రి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.