కన్నబాబుకు ఓటర్ల షాక్..


  
వివాదాస్పద ఎమ్మెల్యే కన్నబాబుకు  ఓటర్లు బుద్దిచెప్పారు.. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు, ఇతర వైసీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం రాంబిల్లి మండలం వి.ఆర్‌.అగ్రహారం వెళ్లారు. తాను బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థినే సర్పంచ్‌గా గెలిపించాలని, లేకుంటే పంచాయతీకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావని హెచ్చరించారు. ఒకవేళ ప్రత్యర్థి వర్గానికిచెందిన వ్యక్తిని గెలిపిస్తే తన ఇంటి గుమ్మం ఎక్కనివ్వనని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓపిగ్గా విన్న గ్రామస్థులు... ఒక్కసారిగా కదిలి, ఎమ్మెల్యేపైకి దూసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గన్‌మన్‌ అప్రమత్తమై రక్షణ చర్యలకు దిగారు. అయినా గ్రామస్థులు వెనుకంజవేయకుండా నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కోపంతో ఊగిపోతూ, చేతిలో వున్న మైకును పడేసిన.. గ్రామస్థుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు తన వాహనం వద్దకు బయలుదేరగా. గ్రామస్థులు కూడా కన్నబాబు వెంటనడుస్తూ నిరసన తెలియజేశారు. అతికష్టంమీద వాహనం ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు..

వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా...కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తన బెదిరింపులకు ప్రజలు ఎదురుకున్నారు.. నాయకుడైన.. సేవకుడైన.. లీడర్ అయినా.. ఫ్లీడర్ అయినా .. అధికారి అయినా.. అచొచ్చిన అంబోతైన ప్రజలకు కోపం రానంత వరకే.. ఒక సారి ప్రజల్లో కోపం పతాక స్థాయికి చేరితే ఎదురు తిరుగుతారు నాయకుల ఆధిపత్య విధానాలను ఎండగడతారు  అవసమైతే ఉప్పుపాతరేస్తారని.. యలమంచి ప్రజలు మరోసారి నిరూపించారు.