కేంద్ర బడ్జెట్ పై విజయసాయి విమర్శలు

 

పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని, ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని అన్నారు. విభజన చట్టంలోని అంశాలపై ఏం మాట్లాడలేదని.. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, పోలవరం, అమరావతి నిర్మాణంపై నిధుల ప్రస్తావనే లేదని అన్నారు. జీరో బడ్టెట్ వ్యవసాయంపై స్పష్టత లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని విజయసాయి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu