8 నుంచి చెల్లెమ్మ షర్మిల పరామర్శ...

 

తెలంగాణ రాష్ట్రం మీద ఆశలు పూర్తిగా వదిలేశాడని అనుకున్న వైసీపీ నాయకుడు జగన్ రీసెంట్‌గా తెలంగాణలో కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తన సోదరి షర్మిలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. అప్పుడెప్పుడో ఐదేళ్ళ క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు తెలంగాణలో బోలెడంతమంది గుండె ఆగి చనిపోయారట. వారి కుటుంబాలను ఐదేళ్ళ తర్వాత షర్మిల పరామర్శించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి షర్మిల తన ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ పరామర్శ యాత్రకి సంబంధించి పోస్టర్ ను ఆదివారం విడుదల చేశారు. మాజీ సీఎం  వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 18 కుటుంబాలను వైఎస్ షర్మిలమ్మ పరామర్శిస్తారు. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను  వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. ఈ పరామర్శ యాత్రకి సంబంధించిన పోస్టర్ని వైసీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు.