కరోనా పై యముడి కన్నీరు..
posted on May 5, 2021 10:45AM
యముడు ఆ పేరు వింటే చాలు. తప్పు చేసినోడి గుండెల్లో గుబులు పుడుతుంది. తప్పు చేస్తే ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ, యముడి నుండి ఎప్పటి తప్పించుకోలేరు అని, ఎప్పటికైనా యముడి ద్వారా భారీ మూల్యం చెల్లించాల్సిందే అని అంటుంటారు దైవత్వం ఉన్నారు. యముడు అదేపనిగా ఎప్పటికప్పుడు తప్పు చేసిన వాళ్ళ చిట్టా పద్దులు తెలుస్తుంటాడని అంటుంటారు. కానీ కరోనా వాళ్ళ ఇప్పుడు యముడికి ఆ అవసరం లేకుండా పోయింది. పని కట్టుకుని తప్పుచేసినోడి తాట తీసేపని ఆయనకు లేకుండా పోయింది.
భారత దేశం లో సంచారం చేస్తున్నాడు. కరోనా రావడం తో ఆయనకు పని తప్పింది. పని కట్టుకుని ప్రాణాలు తీసే పని యముడికి లేకుండా పోయింది. తప్పు చేసిన వారికీ భూమి మీద నూకలు చెల్లితే యమా ధర్మ రాజు ఎకాఎకిన వచ్చి తన పాశం సంధించి గదా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయే యముడు కూడా భారత దేశం పరిస్థితి చూసి యముడు కూడా కన్నీటి పర్వం చెందుతున్నాడు. దేశంలో కొనసాగుతున్న కరోనా మరణాలపై, కరోనా వైరస్ పై అవగాహనా కాలిస్తున్నాడు.. ఆ యముడు.. యముడు ఏంటి? కరోనా మీద కన్నీరు పెట్టడం ఏంటి? కరోనా పై అవగాహనా కల్పించడం ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి తెలుస్తుంది.
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా మాస్కు ధరించాలంటూ హిందూపురం పోలీసులు వినూత్న అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవాసమితి సహకారంతో యముడు, యమ భటుల వేషధారణతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే అనర్థాలను వివరించారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. లేదంటే కరోనా మహమ్మారి బారిన పడతారని హెచ్చరించేలా ఈ కార్యక్రమం సాగింది. ‘నేను యముడిని. మాస్కు పెట్టుకోకుంటే వస్తా.. మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా. బయటకు వస్తే మీ వెంటే ఉంటా..’ అంటూ యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రేపటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో అనవసరంగా బయట తిరిగితే కేసులు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.