గ్రామ వాలంటీర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య !

 

ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందించే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే ఈ వ్యవస్థ పూర్తిగా కుదురుకోక ముందే ఈ వాలంటీర్ల్ పై ప్రతి పనికి డబ్బులు గుంజుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన దంపతులకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి డబ్బులు శాంక్షన్ అయ్యాయి. ఐతే ఈ డబ్బుల కోసం ఆ ఇంటి గృహిణిని అక్కడ పని చేస్తున్న గ్రామ వాలంటీర్ వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఇంటి వద్దకే సేవల మాట అటుంచి ముందు ఈ గ్రామ వాలంటీర్ల నుండి మమ్మల్ని రక్షించండి మహా ప్రభో అని సామాన్యులు వేడుకునే పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.