ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్
posted on Dec 3, 2023 4:21PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 65 స్థానా విజయం సాధించి సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో, కాగా ఈ సారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పలువురు దిగ్గజ నాయకులు పరాజయం పాలయ్యారు. స్వయంగా కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు.
అలాగే ఆరుగురు మంత్రిలు కూడా ఓటమి చెందారు. మరో వైపు ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన అగ్రనేతలందరూ విజయబావుటా ఎగురవేశారు. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుంచి ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చబోతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
పేదల బాగు కోసం కాంగ్రెస్ పని చేస్తుందని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల సలహాలూ, సూచనలను స్వీకరించి ప్రజారంజక పాలనను అందిస్తామని ెప్పారు. కాంగ్రెస్ గెలుపులో ప్రజలు, 30 లక్షల మంది నిరుద్యోగులు, సీపీఐ, జనసమితి పార్టీలు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ట్విట్టర్‌లో కాంగ్రెస్ గెలుపునకు అభినందనలు తెలిపిన వారందరికీ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.