భజన చేసేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే..!
posted on Jan 19, 2024 9:08AM
దేవాలయాలలో కానీ, ఇళ్లలో కానీ, సత్సంగాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ దేవుళ్ల భజన చేస్తన్నప్పుడు, కీర్తనలు ఆలపిస్తున్నప్పుడు భక్తులు ఆనంద పారవశ్యం అవుతూ చప్పట్లు కొడుతుంటారు. అసలు ఇలా చప్పట్లు కొట్టే ఆచారం ఎప్పుడు ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
మతపర ప్రాముఖ్యత..
గ్రంధాల ప్రకారం చప్పట్లు కొడుతూ భజన లేదా కీర్తనలు చేయడం, హరినామాన్ని జపించడం వల్ల పాపాలు తొలగిపోతాయని అంటారు. చెట్టు కింద నిలబడి చప్పట్లు కొట్టగానే చెట్టు పైనున్న పక్షులన్నీ ఎలాగైతే ఎగిరిపోతాయో.. అదేవిధంగా చప్పట్లు కొట్టడం, హరినామాన్ని జపించడం వల్ల మనిషిలో ఉన్న భౌతిక విషయాల మీద వ్యామోహాలు ఎగిరిపోతాయట.
సాధారణంగా గుడిలో గంట కొట్టి దేవుడికి తమ ఉనికిని తెలియజేయడం అని ఒక నమ్మకం. అయితే అదే విధంగా చప్పట్లతో కూడిన భజన దేవుడి దృష్టి భక్తుల వైపు మళ్లేలా చేస్తుందని నమ్ముతారు. భజన, కీర్తన లేదా హారతి సమయంలో చప్పట్లు కొట్టడం ద్వారా భక్తులు తమ బాధలను చెప్పుకోవడానికి దేవుణ్ణి పిలుస్తారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల భగవంతుని దృష్టి భక్తుల వైపు మళ్లుతుంది. భజన-కీర్తన లేదా ఆరతి సమయంలో చప్పట్లు కొట్టడం ప్రతికూలతను తొలగిస్తుంది. మనస్సుకు శాంతిని కూడా ఇస్తుంది. మనిషి స్పృహలో ఉండగలుగుతాడు. వ్యక్తి దృష్టి భగవంతునిపై కేంద్రీకృతమై ఉంటుంది.
పురాణాలు ఏం చెతున్నాయి..
పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుని తనయుడు అయిన ప్రహ్లదుడు సంగీత వాయిద్యాలు వాయిస్తూ విష్ణునామ స్మరణ చేస్తన్నాడు. ఇది హిరణ్యకశ్యపుడికి మింగుడు పడలేదు. ప్రహ్లదుడిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా హరణ్యకశ్యపుడు నెగ్గలేదు. తను ఓడిపోయాననే కోపంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లదుని వాయిద్య పరికరాలు అన్నీ ధ్వంసం చేసాడు. కానీ ప్రహ్లదుడు మాత్రం తన హారినామ స్మరణ మానలేదు. తన చేతులనే వాయిద్య పరికరాలుగా మార్చి చప్పట్లు కొడుతూ హరినామస్మరణ చేయడం మొదలు ప ెట్టాడు. ఇదే తాళం అనే లయను సృష్టించింది. అప్పటి నుండి భజనలలోనూ, కీర్తనలలోనూ తాళం వేయడం, తప్పట్లు కొట్టడం సంప్రదాయంగా మారిందని చెబుతున్నారు.
శాస్త్రీయ కారణాలు..
మన అరచేతుల్లో చాలా ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. చప్పట్లు కొట్టేటప్పుడు అరచేతుల ఆక్యుప్రెషర్ పాయింట్లపై ఒత్తిడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది శరీరంలోని అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కాబట్టి చప్పట్లు కొట్టడం ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది శరీరంలో నిష్క్రియాత్మకతను తొలగిస్తుంది. శరీర కార్యకలాపాలను పెంచుతుంది. రక్త ప్రసరణలో అడ్డంకులు తొలగిపోయి అవయవాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రక్త శుద్ధి పెరిగి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు నయమవుతాయి. అందువల్ల, పూజ, కీర్తన సమయంలో లయబద్ధంగా శక్తితో చప్పట్లు కొట్టడం వల్ల వ్యాధులను తరిమికొట్టడం కూడా సులువు. ఇది ఏకాగ్రతను, ధ్యానం చేయడాన్ని కూడా సులభతరం చేస్తుంది.
*నిశ్శబ్ద.