నువ్వేమి ఇస్తావో సృష్టి కూడా అదే ఇస్తుంది

జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా  ఎందుకు జరుగుతుంది.  కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం  దొరకడం లేదు. నలుగురు కొడుకులు  తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. 
 మౌలానా: జబ్బార్ భాయ్ నువ్వు  కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినప్పటికీ అది నీకు చెందుతుందా? లేదా? అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతీది ఉంటుంది. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతీరూపాయి నీకే చెందుతుంది. నువ్వు పక్కవాడి భూమి కబ్జా  చేసి కోట్లాది రూపాయల ఆస్తి సంపాదిస్తే మాత్రం  పట్టెడన్నం కూడా కరువవుతుంది. సృష్టికి నీవేమి ఇస్తావో సృష్టి కూడా అదే ఇస్తుంది. 
జబ్బార్ భాయ్: అవును మౌలానా సాబ్. నేను 40 ఏళ్ల క్రితం పక్కవాడి భూమి కబ్జా చేశాను. వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టాను. ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పి యజమానిని బుట్టలో వేసుకుని మెల్లి మెల్లిగా భూమి కబ్జా చేశాను. 
 మౌలానా: తెల్సు జబ్బార్ భాయ్  నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు బ్యాంకులో అటెండర్ జాబ్ చేశావు. జీతం కూడా తక్కువే. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కాజేశావు. నీకు భయపడి వాళ్లు కేసు బనాయించకపోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ లో అది చెల్లుబాటు కాదు. ఆ కుటుంబానికి చెందిన వాళ్లు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో నీ భార్య మంచానపడి మరణించింది. భార్య చనిపోవడంతో నీవు ఒంటరి వాడివయ్యావు. మద్యానికి బానిస అయ్యావు. రెండో పెళ్లి చేసుకున్నావు. ఆస్తిలో వాటా వెళుతుందేమోనన్న భయంతో కొడుకులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఏ ఇంటి కోసం పక్కవాడి భూమి కబ్జా చేశావో ఆ భూమి నీకు చెందకుండా పోయింది. 40 ఏళ్ల సర్వీస్ చేసి రూపాయి రూపాయి కూడ బెట్టి బిల్డింగ్ కట్ఠినప్పటికీ జానెడు జాగా లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ కొడుకులకు అయినా  ధర్మబోధనలు చేసి  ధర్మం కాపాడు. ఆఖీరత్  మే జన్నత్ మిలేగా(  ఖురాన్ ప్రకారం చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరడం) . ఖుదాఫీస్  జబ్బార్ భాయ్ 

                                                                                             బదనపల్లి శ్రీనివాసాచారి