గాంధీ ఆస్పత్రిలో అసలేం జరిగింది? గ్యాంగ్ రేప్ నిజమేనా? మిస్సైన మహిళ ఎక్కడ?
posted on Aug 17, 2021 5:18PM
తెలంగాణలో పెద్దాస్పత్రిగా పిలుచుకునే గాంధీ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెళ్లపై ఆసుపత్రిలో సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తాను గాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి ఆస్పత్రి సెల్లార్లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది.
ఈ ఘటనపై గాంధీ హాస్పిటల్ అధికారులతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునాత్ లక్ష్మారెడ్డి గాంధీ హాస్పటిల్ ను సందర్శించి వివరాలు సేకరించారు. హాస్పిటల్ సూపరింటెండ్ రాజారాను అడిగి వివరాలు తీసుకుంది. గాంధీ హాస్పిటల్ లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. గాంధీ హాస్పిటల్ లో డార్క్ రూమ్స్ లేవని, గ్యాంగ్ రేప్ జరిగే అవకాశాలు లేవని రాజారావు చెబుతున్నారు.
కేసు వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన నర్సింహులు మూత్రపిండాల సమస్యసతో బాధపడుతూ ఈ నెల 4వ తేదీన గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనతో పాటు భార్య ఆమె చెల్లి కూడా వెంట వచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు వాళ్ల ఊరే. అయితే అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్ మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత ట్రీట్ మెంట్ జరిగింది. కానీ తీరా అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య చెల్లెలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు నర్సింహులు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు.
ఈ నెల 9వ తేదీన పేషెంట్ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని తెలియడంతో వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో 11వ తేదీన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారంనాడు బాధిత మహిళ కుమారుడికి ఫోన్ చేసిన ఉమామహేశ్వర్ ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో మీపిన్ని ఉంది అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందన్నాడు. తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు.
హైదరాబాద్ లో మిస్సయిన నర్సింహులు మరదలు మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తేలింది. ఏం జరిగింది అని ప్రశ్నిస్తే తనను తన అక్కను కిడ్నాప్ చేశారని కొందరు లైంగికంగా వేధించారని అత్యారానికి పాల్పడ్డారని చెప్పింది. ఏదోలా వాళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డానని ఏడుస్తూ చెప్పింది. అయితే హాస్పిటల్ లో మిస్సయిన ఆమె అక్క జాడ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌నగర్‌లో జీరో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి కేసును హైదరాబాద్‌లోని చిలకలగూడ స్టేషన్‌కు మార్చారు
నర్సింహులు భార్యకు ఆమె చెల్లెల్లికి కల్లు తాగే అలవాటు ఉంది. ఉమామహేశ్వర్ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారని చెబుతున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు ఇంకా ఎవరన్నదానికోసం ఎంక్వైరీ జరుగుతోంది. ఇంకా జాడలేని నర్సింహులు భార్య కోసం కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.