గొంతు నొప్పి వేధిస్తోందా? ఈ సమస్యతో ముప్పు రావచ్చు!
posted on Mar 29, 2023 9:30AM
మారుతున్న వాతావరణం వల్ల తరచుగా అనేక రకాల గొంతు సమస్యలు వస్తాయి. వీటిలో గొంతు ఇన్ఫెక్షన్ చాలా ఇబాబుది పెడుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అదే ఈ ఇన్ఫెక్షన్ ను లైట్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన ఫలితాన్ని పరిచయం చేస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీల వల్ల సంభవించవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు లేదా ఫ్లూ కారణంగా కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే..
గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏ వయస్సు వారిలో అయిన కనిపించవచ్చు. కానీ ఈ సమస్య చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ.
గొంతు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తడం. టాన్సిల్స్‌లో వాపు, నొప్పి. టాన్సిల్స్ మీద తెల్లగా ఉండటం. గొంతు ఎరుపు రంగులోకి మారడం. వాయిస్ లో మార్పు, గొంతు బొంగురు పోవడం జరుగుతుంది. గొంతు ఎండిపోయినట్టు, నాలుక మీద దద్దుర్లు రావడం, జ్వరం-దగ్గు, తలనొప్పి మొదలైనవి ఉంటాయి.
గొంతు ఇన్ఫెక్షన్ కారణాలు..
జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా, స్ట్రెప్ థ్రోట్ సమస్య, గొంతు, టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాలుష్యం, పెంపుడు జంతువులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల అలెర్జీలు వస్తాయి. గొంతు గాయం కారణంగా, స్వర తంతువులు, గొంతులో కండరాలు వ్యాకోచం చెందుతాయి. , దీని కారణంగా గొంతు నొప్పి వస్తుంది. దీర్ఘకాలం గొంతు నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.
గొంతు ఇన్ఫెక్షన్ నివారణ ఇలా..
గొంతు నొప్పి లేదా ఇతర లక్షణాలు ఉంటే, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటిపై రుమాలు ఉంచుకోవాలి.
సిగరెట్ మద్యం అలవాట్లు ఉంటే వాటిని వదిలెయ్యాలి. . పొగతాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. ఎక్కడైనా గాలి కాలుష్యం, ధూళి ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి కానీ చల్లని నీరు మాత్రం త్రాగకూడదు.
గొంతు ఇన్ఫెక్షన్ చికిత్స ఇలా..
గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా మందు వాడటం ముఖ్యం. సమస్య తీవ్రత పెరిగినప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ చికిత్సకు శస్త్రచికిత్సా ప్రక్రియ కూడా ఉంది, దీనిలో టాన్సిల్స్ తొలగించబడతాయి. గొంతు ఇన్ఫెక్షన్‌లో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉప్పు, వెల్లుల్లి, ఆపిల్ వెనిగర్, తేనె, పాలు మంచివి. అలాగే పసుపు, అల్లం, ఆవిరి పట్టడం లికోరైస్ మొదలైనవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
◆నిశ్శబ్ద.