బొప్పాయి తింటే ఏమవుతుంది... ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం!
posted on Mar 28, 2023 9:30AM
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవడం మంచిది. మనం తినే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే బొప్పాయి ఆరోగ్యానికి హానికరంగా కూడా మారుతుంది. అందుకే రోజూ బొప్పాయిని ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య నష్టాలు ఏంటి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
బొప్పాయిలో ఉండే పోషకాలు..
బొప్పాయి విటమిన్ ఎ కి ఖజానా అనుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, అంతే కాకుండా విటమిన్ సి కూడా లభిస్తుంది. మరోవైపు, బొప్పాయిలో చాలా నీరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పదార్థాలు, ఆల్కలీన్ మూలకాలు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, చక్కెర మొదలైనవి కనిపిస్తాయి. సహజంగా, ఫైబర్, కెరోటిన్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బొప్పాయి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటి గింజలను తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు కంటి ఆరోగ్యానికి మంచిది. ఆర్థరైటిస్ రోగులు సమస్య నుండి ఉపశమనం కావాలని అనుకుంటే బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి స్కిన్ టోన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
జుట్టును దృఢంగా ఒత్తుగా మార్చేందుకు బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి గింజలు క్యాన్సర్‌ను నివారించడంలో మేలు చేస్తాయి. అధిక బరువు ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
అధిక రక్తపోటు చికిత్సలో పచ్చి బొప్పాయి ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది.
బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు
గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదు. బొప్పాయిలో పాలు కనిపిస్తే, అది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దీని కారణంగా గర్భస్రావం, ప్రసవ నొప్పి, శిశువులో అసాధారణతలు ఉండవచ్చు.
పాలిచ్చే తల్లులు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. బొప్పాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జాండిస్ సమస్య పెరుగుతుంది.
బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులో రద్దీ, జలదరింపు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక సంవత్సరం లోపు పిల్లలకు బొప్పాయి హానికరం.
◆నిశ్శబ్ద.