అంపైర్ ను తిట్టిన క్రికెటర్.. ఏడేళ్లు నిషేదం..
posted on Jun 8, 2016 4:39PM

సాధారణంగా క్రికెటర్లు గ్రౌండ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేసి జరిమానాలు కడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువ క్రికెటర్ మాత్రం ఓ అంపైర్ ను తిట్టి ఏకంగా ఏడేళ్లపాటు నిషేదానికి గురయ్యాడు. ఈ ఘటన బెర్ముడాలో జరిగింది. వెస్ట్ ఇండీస్ ఆల్‌రౌండర్ కెవన్ ఫబ్లర్ సీ బ్రీజ్ ఓవల్ మైదానంలో బెయిలీస్ బే జట్టుపై విల్లో కట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అయితే తాను ఔటైనప్పుడు అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు వికెట్లను బ్యాటుతో కొట్టి, అంపైర్ పై బాలు విసిరి.. అతనిని తిట్టాడు. దీంతో అతను క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించినందుకు.. బెర్ముడా క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. అయితే ఫబ్లర్ పై చిన్న శిక్షనే విధించేవారు కానీ.. అంపైర్ తిట్టడంతో సీరియస్ గా తీసుకున్న క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఫబ్లర్ గతంలో కూడా సెలెక్టర్ మొల్లీ సిమన్స్‌ను తిట్టినందుకు నిషేధానికి గురయ్యాడు. మరో వైపు ఇలా ఆవేశంతో పదే పదే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తన క్రికెట్ భవిష్యత్ కే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.