బాలింతలకు ఉపయోగ పడే 'జనని సేవ’ పథకం ప్రారంభం..

 

రైళ్లలో ప్రయాణించే బాలింతలు, శిశువులకు ఉపయోగపడే విధంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రైళ్లలో ‘జనని సేవ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బాలింతలు, శిశువులకు ఉపయోగపడే వేడిపాలు, వేడి నీళ్లు సహా ఇతర వస్తువులను 25 స్టేషన్లలో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువుకు పాలు దొరకలేదంటూ ఓ బాలింత చేసిన ట్వీట్‌ తనను చలించేలా చేసిందని.. శిశువుకు వెంటనే పాలు అందేలా ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని.. ఆ ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొనే అందరికీ ఉపయోగపడేలా జననీ సేవ పథకాన్ని ప్రారంభించానని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu