దేశం మొత్తం పవర్ కట్..నేరం కోతిపైకి..!
posted on Jun 8, 2016 4:55PM

సాధారణంగా మనం తప్పు చేసి దొరక్కుండా ఉండటానికి అవతలి వాళ్ల మీదకు నెడుతూ ఉంటాం. అచ్చం కెన్యాలో ఓ ఎలక్ట్రిక్ కంపెనీ తప్పు చేసింది. అయితే నేరం వేరే వాళ్ల మీద తోయడానికి దానికి ఎవరూ కనిపించలేదు. దీంతో తప్పు కోతి పైకి నెట్టేసింది సదరు కంపెనీ. ఆఫ్రికా దేశం కెన్యా మొత్తం ఒక్కసారిగా కారు చీకట్లలోకి వెళ్లిపోయింది. దీంతో మూడు గంటల పాటు చీకటి రాజ్యమేలింది. దీనిపై ప్రభుత్వం ఎలక్ట్రిక్ కంపెనీ వివరణ కోరింది. దానికి ఆ కంపెనీ ఒక కోతి తమ కంపెనీ గిటార్ పవర్ స్టేషన్ పైకప్పు మీదకు ఎక్కిందని, అక్కడి నుంచి ట్రాన్స్ ఫార్మర్ మీద పడటంతో పవర్ ట్రిప్ అయ్యిందని, ఈ కారణంతో అన్ని మెషిన్లు పనిచేయకపోవడంతో 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పింది. అయితే ఆ కోతి బతికే ఉందా..చనిపోయిందా ..? ఆ కోతిని ఎవరైనా చూశారా అన్న క్వశ్చన్స్‌కి మాత్రం కంపెనీ అన్సర్ ఇవ్వలేదు.