విజయసాయిరెడ్డికి రాజ్యసభలో వార్నింగ్!
posted on Jul 25, 2024 7:08PM
వైసీపీ పక్షవాతం వచ్చి, మూలన పడి, అంతిమ ఘడియల్లో వుంది. అలాంటి వైసీపీకి వెన్నెముక లాంటి విజయసాయి రెడ్డి మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో రకరకాల చెత్త వాగుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. పరమ పవిత్రమైన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేస ప్రయత్నం చేయబోగా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో వున్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఉన్నత స్థానంలో వున్న చంద్రబాబు గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు అని ఆయన వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి తన ధోరణిలోనే చెప్పుకుంటూ వెళ్ళడంతో హరివంశ్ సీరియస్ అయ్యారు. మీరు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదు.. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మీరు నాకు సాయంత్రం లోపు అందజేయాలి.. లేకపోతే మీరు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.