కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి..

 

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగడానికి కేసీఆర్ పసునూరి దయాకర్ ను ఎంపికచేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందే ఆయన గుడిమళ్ల రవికుమార్ పేరును సెలక్ట్ చేశారంట. కొడుకు కేటీఆర్ సిఫారసు మేరకు ఆయనను ఎంపిక చేసిన కేసీఆర్.. పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పకుండా ఉండేదుకు కాను వారికి ముందే బ్రెయిన్ వాష్ చేశారు. ఎంపీ అంటే ఆషామాషీ కాదని.. ఇంగ్లీషు హిందీ వచ్చి ఉండాలి.. బాగా చదువుకుని ఉండాలి.. న్యాయం చట్టం తెలిసి ఉండాలి. రాజ్యాంగం మీద పూర్తి పట్టుఉండాలని అందుకే రవికుమార్ ను ఎంపిక చేయనున్నామని ముందుగానే చెప్పారు.

కానీ సీన్ రివర్స్ అయింది కేసీఆర్ చెప్పింది వేరు చేసింది వేరు.. ఆఖరి నిమిషంలో దయాకర్ పేరును ఎంపిక చేశారు. ఎందుకంటే రవికుమార్ న్యాయవాది అయినప్పటికీ ఆయనకు పార్టీ పరంగా అంతగా గుర్తింపు లేదు. దయాకర్ అయితే పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ.. మంచి కార్యకర్తగా పేరుతెచ్చుకున్నాడు.. అందుకే కేసీఆర్ దయాకర్ ను ఎంపిక చేశారు. అయితే కేసీఆర్ చెప్పినట్టు దయాకర్ కు అన్ని తెలుసా అని డౌట్ రావచ్చు కానీ ఆయన కేవలం  ఫైన్ ఆర్ట్స్ పట్టభద్రుడు మాత్రమే. ఇక రాజ్యాంగం - హిందీ మీద ఆయనకు ఉన్న పట్టు ఏపాటిదో మనకు తెలియదు.