జీహెచ్ఎంసీ ఎన్నికలు.. మళ్లీ గడువు కోరిన టీ సర్కార్


జీహెచ్ఎంసీ  ఎన్నికల జాప్యంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వార్డుల విభజన, ఆధార్ అనుసంధానం వల్ల ఎన్నికల నిర్వహణలో జాప్యం అయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అంతేకాదు ఎన్నికల నిర్వహణకు మరోసారి గడువు కావాలని.. జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని టీఎస్ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ గడువుకు సంబంధించి ప్రమాణ పత్రం సమర్పించాలని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.