జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు లేదా?
posted on Nov 1, 2022 10:39AM
దేశంలో ఓటర్లు ఎంతమంది, మనకు ఎంతశాతం ఓట్లు వస్తాయి, మన పార్టీవారు వేరే పార్టీవారికి జారిపోకుండా కట్టు దిట్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదలయిన వన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేనివారికి ఆ హక్కు కల్పించే యత్నాలూ ముమ్మరంగా చేపడుతుంటారు. అయితే, ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్నారి సంగతేమిటి? అనే ప్రశ్న కూడా తలెత్తకా పోదు. వారిని కూడా ఓటర్లుగా భావించి ఓటు హక్కు కల్పిస్తారా అన్న అంశంపై చాలా కాలం నుంచే చర్చ ఉంది. కానీ పెద్దగా సీరియస్ గా పట్టించు కున్నట్టు లేదు. వాస్తవానికి 1951 ప్రజాప్రతినిధుల చట్టం జైల్లో ఉన్నవారికి ఓటు హక్కు లేదు. కానీ వారి ఓటుహక్కు వినియోగానికి వీలు కల్పించాలని కోరడం జరుగుతోంది. దీన్ని గురించి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ యింకా స్పందించాల్సి ఉంది.
అయితే ఈ అంశంలో పిల్ ను అంగీకరించే సమయానికి అంటే డిసెంబర్ 9వ తేదీలోగా సుప్రీం కోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన బెంచ్ కేంద్రం, ఈసీ స్పందించాలని ఆదేశించింది.
అయితే, ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా రవాణా లేదా మరేదైనా జైలులో నిర్బంధించబడినా, లేదా పోలీసు చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నట్లయితే, ఏ వ్యక్తి ఏ ఎన్ని కల్లోనూ ఓటు వేయకూడదు: ఈ ఉప విభాగంలోని ఏదీ నివారణ నిర్బంధానికి గురైన వ్యక్తికి వర్తించదని సెక్షన్ 62(5) తెలియజేస్తుంది.
కాగా. జైల్లో ఉన్న వ్యక్తి శిక్షాకాలం, చేసిన పని గురించిన స్పష్టత మాత్రం ఎలాంటి స్పష్టీకరణను ఓటు హక్కు నిషే ధంలో లేదని , జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో ఆదిత్య భట్టాచార్య వేసిన పిల్ పేర్కొన్నది. అంటే ఎంత కాలం నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి ఓటు హక్కు ఉండదు, ఎంత స్థాయి నేరం చేసినవారికి ఉండదూ అనే అంశాలు స్పష్టంగా లేవని ఆయన పిల్ లో పేర్కొన్నా రు. అంతేగాక, నిర్దోషిత్వం లేదా అపరాధం నిశ్చయంగా నిర్ధారించబడని అండర్ ట్రయ ల్‌లు, వారు కూడా జైలులో నిర్బంధించబడినందున వారి ఓటుహక్కును కోల్పోతారని, అయితే బెయిల్‌పై విడుదలై నప్పటికీ దోషి ఓటు వేయవచ్చని పేర్కొంది. మొత్తానికి జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు గురించి సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంది.