రాజ్‌నాథ్ సింగ్ తో ముగిసిన భేటీ..
posted on Jun 26, 2015 1:08PM

రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సెక్షన్ 8 అమలు విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి సమావేశం జరిగింది. అయితే మొదట హోంశాఖ కార్యదర్శి గోయల్ తో భేటీ అయి.. తర్వాత జాయింట్ సెక్రటరీ అలోక్ కుమారు తో భేటీ అయ్యారు. అనంతరం ముగ్గుర కలిసి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. తరువాత మళ్లీ గవర్నర్ ఒక్కరే రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో నోటుకు ఓటు కేసు గురించి, సెక్షన్ 8 అమలు గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్రం ఖచ్చితంగా ఉన్నట్టు.. గతంలో కేంద్రం పంపిన గైడ్ లైన్స్ ను యధాతథంగా జరిగించాల్సిందేనని గవర్నర్ కు స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.