కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు
posted on Jun 26, 2015 11:40AM

ఓటుకు నోటు కేసులో అత్యంత కీలక సాక్షి అయిన స్టీఫెన్ సన్ సీఎం కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తెదేపా నేతలు స్టీపెన్ సన్ పై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ముందు కూడా ఇలాగే రహస్యంగా మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఇరికించారని.. ఇప్పుడు కేసు కీలకదశలో ఉన్నప్పుడు కేసీఆర్ ను కలవాల్సిన అవసరం ఏముందని.. అసలు అలా ఎలా కలుస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ ఎలా చెబితే స్టీఫెన్ సన్ అలా నడుచుకుంటున్నాడని.. ఎలా తప్పుడు వాంగ్మూలం చెప్పాలో కేసీఆర్ పాఠాలు చెప్పుతున్నాడని మండిపడుతున్నారు. స్టీఫెన్ సన్ కేసీఆర్ ను కలవడానికి వెళ్లొచ్చు కానీ మత్తయ్య అత్తగారింటికి వెళ్తే తప్పా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి కేసులో తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని.. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా మావద్ద ఆధారాలున్నాయని.. ఈ విషయంలో కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెదేపా నేతలు అంటున్నారు. జగన్ తో కలిసి కుట్రలు పన్ని తెదేపాను దెబ్బతీయాలని చూశారు కానీ దీనివల్ల కేసీఆరే ఇరుక్కుపోయాడని విమర్శించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని.. కానీ నగరంలో సెక్షన్ 8 అమలు తప్పకుండా జరగాలని.. అలా అయితేనే హైదరాబద్ లో ఉంటున్న సీమాంధ్రులకు న్యాయం జరుగుతుందని అన్నారు.