ఆడియో, వీడియో టేపులు మాకివ్వండి.. ఈసీ

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అరెస్ట్ వ్యవహారంపై కేంద్రం ఎన్నికల సంఘం కోర్టులో మెమో దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో వీడియో రికార్డింగులను, రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారమంతా తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలంగాణ ఏసీబీ అధికారులను కోరింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకి అందజేశామని ఏసీబీ అధికారులు చెప్పడంతో కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే ఈ విషయంపై కొద్దిరోజుల క్రితమే ఎన్నికల సంఘం కోర్టులో మెమో దాఖలు చేయగా కోర్టు దానిని అనుమతించకపోవడంతో మళ్లీ మెమో దాఖలు చేయాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది.

 

అసలు ఎన్నికల నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ చేసేపుడు ఎన్నికల సంఘానికి తప్పకుండా తెలయజేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు అధికారులు కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ అధికారులు మాత్రం అవేమి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu