విష్ణు ప్రియకు హైకోర్టులో లభించని ఊరట

యాంకర్ విష్ణు  ప్రియకు శుక్రవారం  తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న  విష్ణు ప్రియపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని విష్ణు  ప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నెల 20న విచారణకు హాజరయ్యారు. మరోసారి 25న విచారణకు రావాలని పోలీసులు విష్ణు  ప్రియకు  నోటీసులు ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని విష్ణు  ప్రియ హైకోర్టునాశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన క్లయింట్ విష్ణు ప్రియపై పోలీసులు అక్రమ కేసు బనాయించి  కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియ అడ్వకేట్ కోర్టులో వాదించారు.  విష్ణు ప్రియపై నమోదైన కేసును కొట్టివేయడానికి  న్యాయస్థానం జోక్యం చేసుకోదని పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు  నమోదైన నేపథ్యంలో కోర్టు నాశ్రయించినట్లు  తెలుస్తోంది.