కోహ్లి, అనుష్క కు దేశభక్తి ఉందా? ఎమ్మెల్యేకు వార్నింగ్...!
posted on Dec 20, 2017 4:24PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే వీరి పెళ్లిపై బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇండియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా? మనందరం కూడా ఇక్కడే పెండ్లిళ్లు చేసుకున్నాం.. ఇకపైనా చేసుకుంటాం. మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా? మరి కోహ్లి మాత్రం ఆ పని ఎందుకు చేసినట్లు? ఇక్కడ (ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేంటి?’ అని పన్నాలాల్ అన్నారు. ఇక దీనిపై బీజేపీ నేతలే స్పందించి పన్నాలాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లి దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం పన్నాలాల్ కు లేదు.. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే తీరు మార్చుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ' ' విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఆ ఎమ్మెల్యేకు లేదు. నచ్చినచోట పెళ్లిచేసుకొనే అవకాశం వారికి ఉందని అన్నారు.