అది జయలలిత కాదు..!
posted on Dec 20, 2017 5:14PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి.. అపోలో చికిత్స పొందుతున్న జయలలిత అంటూ.. దినకరన్ వర్గానికి చెందిన వేట్రివేల్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. రేపు ఆర్కే నగర్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. ఈరోజు ఈ వీడియో బయటకు రావడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేగుతోంది. అయితే దీనిపై జయలలిత స్నేహితురాలు గీత స్పందించి.. అది నకిలీ వీడియో అని... దానిని సరికొత్త టెక్నాలజీతో సృష్టించారని గీతా ఆరోపించారు. టీవీలో తాను వీడియో చూశానని, అందులో ఉన్నది వంద శాతం జయలలిత కాదని... సరికొత్త టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వీడియోలో ఉన్నది జయలలిత అని నమ్మించడానికి శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఆ వీడియోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశీలించాలని గీతా డిమాండ్ చేశారు.
మరోవైపు.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదనిలయంలో ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలో ఈ వీడియో తీశారని విధుతలై చిరుతైగల్ కచ్చి ( వీసీకే) నేత తిరుమావళన్ ఆరోపించార