ఆర్కే నగర్ ఉపఎన్నికపై స్వామి జోస్యం... గెలిచేది అతడేనట..!
posted on Dec 20, 2017 3:25PM
.jpg)
ఎప్పుడూ వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి ఆయన తమిళనాడులో రేపు జరగనున్న ఆర్కే నగర్ ఉపఎన్నికపై స్పందించాడు. ఈ ఎన్నికలో పోటీ దినకరన్‌కు, డీఎంకేకి మధ్యనే ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అంతేకాదు, దినకరన్ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. దినకరన్‌కు, డీఎంకేకు అధికార పార్టీ అసలు పోటీనే కాదని.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్దరూ అసమర్థులని.. డీఎంకే పార్టీ హిట్లర్ పార్టీ అని, దాని నుంచి దినకరన్ మాత్రమే ప్రజలను కాపాడగలడని అన్నారు. కాగా రేపు ఆర్కే నగర్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.