కాంగ్రెస్ లోకి విజయశాంతి... ధృవీకరించిన మల్లు రవి
posted on Nov 11, 2023 4:27PM
బిజెపిలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారా? అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి బలం చేకూరే విధంగా పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. ప్రస్తుతం బిఆర్ ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో విజయశాంతి అడుగులు వేస్తున్నారని బట్టి విక్రమార్క ధ్రుృవీకరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు విజయశాంతి తనతో అన్నారన్నారు. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో ఉన్నారు. కొన్నిరోజులుగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి ఆమె పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా ఆమె కమలం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడినప్పుడే విజయశాంతి కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఈసారి మాత్రం పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆమె వరుసగా పెడుతున్న ట్వీట్లే కారణంగా తెలుస్తోంది.గత కొంతకాలంగా పువ్వు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా లభించలేదు.. ఇటీవల బిజెపి స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో కూడా ఆమెకు చోటు దక్కలేదు. దీంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు ఉధృతంగా ప్రచారం జరుగుతున్నా ఎక్కడా పాల్గొనడం లేదు. దీంతో నేడో.. రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది.