కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా
posted on Nov 11, 2023 1:55PM
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం, పార్టీ హై కమాండ్ వెంటనే ఆయనకు మునుగోడు అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెందిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆమె పార్టీ ప్రాథమిక సభ్యవత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ నాలుగు పేజీల లేఖ పార్టీ అధిష్ఠానానికి పంపారు. త్వరలో తాను బీఆర్ఎస్ లో చేరనున్నట్లు పాల్వాయి స్రవంతి ప్రకటించారు.