తెరాసలో చేరనున్న విజయశాంతి.!!

 

విజయశాంతి.. రాములమ్మగా, లేడీ సూపర్ స్టార్ గా తెలుగు ప్రజలకు, సినీ ప్రేక్షకులకు సుపరిచితం.. ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి తరువాత రాజకీయ రంగప్రవేశం చేసారు.. రాష్ట్ర విభజనకు ముందు తెరాసలో ఉన్న విజయశాంతి తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు.. రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి పార్టీలో తనకి సరైన గుర్తింపు ఇవ్వట్లేదని అసంతృపితో ఉన్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు ఆమె త్వరలో తిరిగి తెరాస గూటికి చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలు, కార్యక్రమాలకు విజయశాంతి ఎటువంటి సమాచారం కానీ ఆహ్వానం కానీ ఇవ్వట్లేదట.. దీంతో ఆమె పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. మరి రాములమ్మ నిజంగానే కాంగ్రెస్ ని వీడి తెరాసలో చేరతారో లేదో చూడాలి.