పాలు,కూరగాయలు అమ్మి మహా కూటమికి ఖర్చు

 

తెలంగాణలో ఎన్నికలు జరగనున్నది విదితమే.ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం 500 కోట్లు, 3 హెలికాప్టర్ల ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏకంగా మహాకూటమి ఖర్చు అంతా చంద్రబాబుదే అంటూ సెటైర్లు వేశారు."తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా! " అని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.