జగన్ కు ఓటేస్తే ఒక్కొక్కరికి 57 వేలు నష్టం

జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే, రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న పేదలు ఒక్కొక్కరికి రాబోయే అయిదేళ్లలో 57 వేల రూపాయలు నష్టపోతార‌ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీలక్ష్మీ శ్యామల చెబుతున్నారు. మహిళ ఓటర్లతో 27 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్ర‌చారం నిర్వ‌హించారు. 

అధికారంలోకి వ‌స్తే చంద్రబాబునాయుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పింఛనును 4000 చేస్తానని ప్రకటించారు.  జులై నెలలో అరియర్స్ కలిపి 7వేల రూపాయల పింఛన్లు అందుకుంటారు.  
జగన్ సర్కారు ప్ర‌స్తుతం కేవ‌లం మూడువేల పెన్షను మాత్రమే అందిస్తోంది. జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోలో  అయిదేళ్లకూ కలిపి 500 మాత్రం పెంచేలా హామీ ఇచ్చారు. అది కూడా.. 2028 ఏప్రిల్లో 250, 2029 ఏప్రిల్లో అంటే జస్ట్ ఎన్నికలకు ముందు మరో 250 పెంచుతానని పేర్కొన్నారు.  అంటే జగన్ ను గెలిపిస్తే ఇప్పుడున్న మూడు వేలు  మాత్రం ప్రజలకు అందుతాయన్నమాట. 

ఇటు చంద్ర‌బాబు, అటు జ‌గ‌న్ హామీలను పోల్చి చూస్తే..చంద్రబాబు ఇచ్చేది అయిదేళ్లలో రూ.2.40 లక్షలు.  జగన్ ఇచ్చేది అయిదేళ్లలో రూ.1.83 లక్షలు. తేడా 57 వేలు.  అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారని శ్రీలక్ష్మీ శ్యామల  ప్ర‌చారం చేస్తున్నారు. 

జ‌గ‌న్‌పై కేసులు కావొచ్చు, ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడూ ప్ర‌శ్నించ‌ని ఆయ‌న సొంత ప‌నులే చూసుకున్నారు. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు త‌దిత‌ర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మంటారు శ్రీలక్ష్మీ శ్యామల. ఆకువేడు ఉండి నియోజకవర్గంలో ఆమె రఘురామకృష్ణ రాజు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.  రఘురామకృష్ణంరాజు తన గెలుపు పక్కా ..మెజార్టీ లెక్కేసుకోవడం మిగిలింది.