చంద్రబాబు ఇంట్లోనే ఆభరణాలు ఉన్నాయి...!


తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇప్పటికే ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నేల మాళిగలో దాచిన ఆభరణాలపై వివాదం మరింత ముదరుతోంది. ఇప్పుడు దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలమాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్, అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని... 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో సీబీఐ లేదా తెలంగాణ పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయని చెప్పారు. చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. 12 గంటల కంటే ఎక్కవ సమయం ఇస్తే... ఆ ఆభరణాలన్నీ విదేశాలకు తరలిపోతాయని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu