మాల్యాకి బిగుస్తున్న ఉచ్చు.. ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా

 

విజయ్ మాల్యా కేసులో దర్యాప్తు వేగవంతం చేయడానికి.. కేసును సిట్ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరో కీలక అడుగు వేసినట్టు తెలుస్తోంది. మాల్యాను ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా ప్రకటించాలని ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈడీ అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే... మాల్యా అరెస్ట్ కు అవకాశాలు మరింత మెరుగుపడతాయన్న వాదన వినిపిస్తోంది.

 

కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈయన పై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయించింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu