మాల్యా కేసు.. భారత్ కు లండన్ కోర్టు చీవాట్లు..
posted on Jul 7, 2017 3:08PM
.jpg)
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ఎంచక్కా లండన్ పారిపోయి.. అక్కడ తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుండి మాల్యాను భారత్ కు రప్పించడానికి నానా ప్రయత్నాలు జరుపుతుంది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ గురువారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగింది. ఈ క్రమంలో భారత్ 2030 పేజీల రుజువు పత్రాలను సమర్పించారు. ఇక భారత్ సమర్పించిన పత్రాలను చూసి న్యాయస్థాన జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్ షాక్ తిన్నారు. వీలైనంత త్వరగా 2030 పేజీల సాక్ష్యాధారాలను 30 నుంచి 35 పేజీలకు కుదించాలని చీవాట్లు పెట్టారు. తరువాత విచారణను డిసెంబర్ 4 కు వాయిదా వేసింది.