మరోసారి వార్తల్లో ట్రంప్ షేక్‌ హ్యాండ్‌..

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ విదేశీ పర్యటనలు చేసినా ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటది. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌, రోమ్‌ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన భార్య మిలానియా ప్రవర్తనపై వచ్చిన వార్తలు అన్నీ ఇన్నీ కాదు. ట్రంప్‌ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె చేతిని వదిలించుకోవడం కెమెరా కంటికి చిక్కింది. ఇంకేముంది దీనిపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు కథనాలు రాసేశారు. ఇప్పుడు మరోసారి తాజాగా ట్రంప్ కు అలాంటి ఘటనే ఎదురైంది. ప్రస్తుతం ట్రంప్ పోలాండ్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్బంగా..  పోలాండ్‌ అధ్యక్షుడు ఆంద్రెజ్‌ దుడా..ట్రంప్ కు దుడా స్వాగతం పలికారు. తొలుత ఆంద్రెజ్‌కు ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఆ తరువాత ఆయన భార్య అగాటా కోర్న్‌హౌషర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇస్తుండగా.. ఆమె మాత్రం ట్రంప్‌ను దాటుకుంటూ వెళ్లి మిలానియాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ముచ్చటించారు. ఆ తర్వాత కాసేపటికి వెనక్కు తిరిగి ట్రంప్‌తో కరచాలనం చేశారు. దీంతో ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu