ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విజిలెన్స్ విచారణ
posted on Dec 16, 2025 1:38PM

హైదరాబాద్ లోని ఐడీపీఎల్ భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా, మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.
ఈ విచారణలో కబ్జాదారులు ఎవరన్నది తేలితే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.