ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్

 

తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకొగానే బీజేపీ  అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు.

కేవలం కేంద్ర మంత్రి  అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu