నా నగ్న ఫొటోలు లీక్ చేసి తప్పు చేశా

 

ఈమధ్య హాలీవుడ్ హీరోయిన్లకి తమ నగ్న ఫొటోలు తీసుకోవాలన్న మోజు బాగా పెరిగిపోయింది. వాళ్ళ మోజుకు తగ్గట్టుగా చక్కగా నగ్నంగా ఫొటోలు దిగి కంప్యూటర్లలో దాచుకుంటున్నారు. అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ తమలో తామే మురిసిపోతున్నారు. అయితే ఈమధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అలా తమ నగ్న ఫొటోలు కంప్యూటర్లలో దాచుకుంటే హ్యాకర్లు ఎంచక్కా వాళ్ళ కంప్యూటర్లని హ్యాక్ చేసి సదరు బ్యూటీఫుల్ ఫొటోలని ఇంటర్నెట్లో లీక్ చేశారు. ఆ విషయం తెలుసుకుని సదరు హీరోయిన్లు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ స్టోరీ ఇలా వుంటే, వికి గున్వాల్సన్ అనే హాలీవుడ్ హీరోయిన్ తన నగ్న ఫొటోలు తానే ఇంటర్నెట్లో లీక్ చేసింది. దాంతో ఇంకేముందు... అంతా రచ్చ రంబోలా అయింది. ఆ ఫొటోలని చూసి కుర్రకారు పిచ్చెక్కిపోయారు. అంతవరకూ బాగానే వుందిగానీ, వికి గున్వాల్సర్ తన నగ్న ఫొటోలను తానే లీక్ చేయడం పద్ధతిగా లేదని కొంతమంది విమర్శించారు. ఆ విమర్శలను మొదట్లో ఎంతమాత్రం పట్టించుకోని వికి ఇప్పుడు పశ్చాత్తాపపడిపోతోంది. తన నగ్న ఫొటోలను తానే లీక్ చేసి పొరపాటు చేశానని అనిపిస్తోందని బాధపడుతోంది. ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన తప్పును తాను వెనక్కి తీసుకోలేనని చెప్పింది. ఇప్పటికే తన నగ్న ఫొటోలు ప్రపంచమంతా వ్యాపించిపోయాయని అంటోంది. నేను సాధారణ మనిషిని. మనుషులందరూ తప్పులు చేస్తారు. నేను కూడా తప్పు చేశాను క్షమించండి అంటూ సినిమా డైలాగ్స్ చెబుతోంది.