అజిత్ సినిమా టీజర్ అదుర్స్

 

అజిత్, అనుష్క, త్రిష హీరో హీరోయిన్లుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్నాయి అరిందల్’ (తెలుగులో ఎంతవాడు గానీ..) త్వరలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవటానికి ముస్తాబుతోంది. ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ విడుదల చేసిన 48 గంటల్లోనే 2 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. ఈమధ్యకాలంలో విడుదలైన దక్షిణాది చిత్రాల్లో ఏ చిత్రం టీజర్నీ ఇంతమంది ప్రేక్షకులు చూడలేదని తెలుస్తోంది. ‘ఎన్నాయ్ అరిందల్’ టీజర్ ఆమధ్య విడుదలైన ‘బాంగ్ బాంగ్’ సినిమా టీజన్ వ్యూయర్లని కూడా మించిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.