నాకు రెండు కోర్కెలు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ...తెలుగు భాషకు గ్లామర్ మాత్రమే కాదని..గ్రామర్ కూడా ఉందన్నారు.. ఇదే సందర్భంలో తాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి రెండు కోర్కెలను ఆశిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడం..రెండోది తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడమన్నారు. ఇంగ్లీష్ జబ్బు మనల్ని చాలా కాలంగా పట్టుకుందని..ఇది వదలడం అంత సులభం కాదన్నారు. దీనికి మందు కూడా లేదన్న విషయం తనకు తెలుసన్నారు. భారత ఉప రాష్ట్రపతిగా అంతర్జాతీయ వేదికలపైనా, రాజ్యసభ ఛైర్మన్‌గా తాను కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూనే ఉంటానన్నారు..కానీ భాష ద్వారానే మన సంస్కృతిని వ్యక్తం చేయగలమన్న ఆయన దాన్ని మరచిపోరాదన్నారు..కన్నతల్లిని, మాతృభాషను, జన్మభూమిని మరచిపోయినవాడు నా దృష్టిలో మనిషే కాదన్నారు వెంకయ్య.