కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు...
posted on Jul 4, 2017 2:48PM
.jpg)
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ టీఆర్ఎస్ నేతలతో కలిసి జలవిహార్‌లో హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఇతర పార్టీల అధినేతల్లో కోవింద్ కు మొట్టమొదట మద్దతిచ్చిన ఘనత కేసీఆర్ దేనని, అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. కేసీఆర్ రామ్ నాథ్ కు ఘనస్వాగతం పలికారని.. ఈ స్వాగతం ఆయనకు చాలాకాలం గుర్తుండిపోతుందని, తెలంగాణపై ఆయనకు ప్రేమను పెంచుతుందని తెలిపారు. ఇక కోవింద్ గురించి మాట్లాడుతూ..యూపీలోని ఓ చిన్న గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన రామ్ నాథ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారని.. న్యాయకోవిదుడైన ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సైతం వాదించారని గుర్తు చేశారు.