ఉత్తరకొరియా చేసే చెత్తపనులను వెంటనే ఆపాలి..

 


ఎవరెన్ని చెప్పినా ఉత్తరకొరియా మాత్రం తమ పనితాను చేసుకుంటూ పోతుంది. అగ్రరాజ్యాల మాటలను సైతం లెక్కచేయకుండా ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. జపాన్ పై ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ తీరుపై మండిపడ్డారు. ‘ఉ.కొరియా మరో క్షిపణిని ప్రయోగించింది. ఈ వ్యక్తి తన జీవితంలో ఏదైనా మంచిపని చేయలేడా?’ అని కిమ్‌నుద్దేశించి ట్వీట్‌ చేశారు. ఏళ్ల నాటి నుంచి ఉ.కొరియా వైఖరిని దక్షిణకొరియా, జపాన్‌ భరిస్తున్నాయంటే నమ్మడానికే కష్టంగా ఉందని ట్రంప్‌ అన్నారు. దీనికి చైనా దీటుగా బదులుచెప్పి ఉత్తరకొరియా చేసే చెత్తపనులను వెంటనే ఆపాలని ట్రంప్‌ కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu