చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్న సోనియా

అధిష్టానం ప్రత్యేక ప్రతినిధిగా హైదరాబాద్ విచ్చేసిన వాయలార్ రవి ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చిరంజీవి ఇంటికి విందుకు వెళ్ళడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో కాపుల ప్రాధాన్యత పెరుగుతున్నట్టు కాపు సామాజికవర్గ నేతలు, కార్యకర్తలు సంతోషపడుతున్నారు. చిరంజీవి రాష్ట్రానికి చెందిన నాయకుడే కాదు జాతీయస్థాయిలో ప్రాధాన్యత కలిగిన నాయకుడని వాయలార్ రవి స్వయంగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలో చిరంజీవి ప్రతిష్ట మరింతగా పెరిగినట్టుగా భావిస్తున్నారు.

 

రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే కాపు సామాహిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువగా వుంటుందని, ఇదే సమయంలో చిరంజీచి ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగా కాకుండా సౌమ్యంగా, నమ్మకంగా వ్యవహరిస్తారనే భావనతోనే సోనియా గాంధీ, చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన అగ్రకులాలుగా భావిస్తున్న రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలలో సంఖ్యాపరంగా కాపు వర్గానిదే పైచేయి. కోస్తాఆంధ్రలో కాపు సామాజికవర్గం సంఖ్య మరింత ఎక్కువ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభావం కోస్తాప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న ప్పటికీ తెలంగాణా ప్రాంతంలో నామమాత్రమే. ప్రస్తుతం ఇంటిలిజెన్సీ సమాచారం ప్రకారం కోస్తాప్రాంతంలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కోస్తాప్రాంతంలో కూడా జగన్ ప్రభావం తగ్గించవచ్చునని అధిస్థానం అంచనా వేస్తున్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu