వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది.

కాగా వంశీకి బెయిలు ఇవ్వవద్దంటూ పటమట పోలీసలు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో వాదనలు వినడం కోసం వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఎల్లుండికి అంటే గురువారం (ఏప్రిల్ 17)కు వాయిదా వేసింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.