యూపీ సీఎంపై ఉత్కంఠ.. పూజలు చేస్తున్న సిన్హా..
posted on Mar 18, 2017 10:39AM

యూపీ సీఎం ఎవరన్నది ఈ రోజుతో తేలిపోనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బీజేపీ నేతల సమావేశంలో యూపీకీ కాబోయే సీఎం ఎవరో ప్రకటించనున్నారు. అయితే ఈ రేసులో ఇప్పటికే ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నసంగతి తెలిసిందే. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురిలో ఎవరికి సీఎం పదవి దక్కవచ్చు అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో రాజ్ నాథ్ సింగ్ రేసు నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా యూపీ పార్టీ అధ్యక్షుడు మౌర్య కూడా అంతగా ఆసక్తి చూపించకపోవడంతో సిన్హాకు యూపీ అందలం దక్కవచ్చునని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన కాల భైరవ, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భూపీంద్ర సింగ్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.