రేసర్ అశ్విన్, అతని భార్య సజీవ దహనం..
posted on Mar 18, 2017 10:51AM

చెన్నైలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇండియా రేసర్ అశ్విన్ సుందర్, అతని భార్య సజీవదహనమ్యయారు. వివరాల ప్రకారం.. అశ్విన్ సుందర్ తన భార్య నివేదితతో కలసి బీఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తున్నారు. కారు చెన్నై సమీపంలోని శాంతం హైరోడ్డులోకి రాగానే పక్కనున్న చెట్టుకు ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇద్దరు కారులోనే ఇరుక్కుపోవడంతో సజీవ దహనం అయ్యారు. కాగా ఆశ్విన్ 2003లో ఎంఆర్ఎఫ్ ఫార్ములా మోండియల్ నేషనల్ ఛాంపియన్ షిప్ ను తొలిసారి గెలుచుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎఫ్4 నేషనల్ ఛాంపియన్ గా అవతరించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం అశ్విన్ ప్రతిభను కనబరిచారు. అశ్విన్ మరణవార్తతో అందరూ షాక్ కు గురయ్యారు.