దేవర ముంగిట నువ్వెంత.. సైడ్ ఇస్తున్న బడా సినిమాలు!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా, పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో సంచలన వసూళ్లు రాబట్టే అవకాశముంది. అందుకు తగ్గట్టే, ప్రస్తుతం దేవరకి అన్నీ కలిసొస్తున్నాయి.

దేవర విడుదలవుతున్న వారంలో ఇతర భారీ సినిమాలేవీ విడుదల కావడంలేదు. కార్తీ నటిస్తున్న తమిళ చిత్రం 'మెయ్యజగన్' సెప్టెంబర్ 27న  విడుదలవుతున్నప్పటికీ.. అది పాన్ ఇండియా మూవీ 'దేవర'పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ చిత్రం 'స్కై ఫోర్స్' అక్టోబర్ 2 విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. ఒకవేళ 'స్కై ఫోర్స్' విడుదలైతే నార్త్ లో దేవరపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 

ఇక తమిళ స్టార్ సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కంగువా' అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా, అది పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 10న రజినీకాంత్ 'వేట్టయాన్‌' కూడా విడుదల కానుంది. ఒకవేళ 'కంగువా' వాయిదా పడకపోతే.. ఈ రెండు సినిమాల వల్ల తమిళనాట దేవరకి లాంగ్ రన్ లో థియేటర్లే ఉండేవి కాదు. తెలుగురాష్ట్రాలతో పాటు, నార్త్ లోనూ ఎంతో కొంత ప్రభావం ఉండేది. 

మొత్తానికి హిందీ చిత్రం 'స్కై ఫోర్స్', తమిళ చిత్రం 'కంగువా' వాయిదా పడటం.. 'దేవర' వంటి పాన్ ఇండియా మూవీకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాజిటివ్ టాక్ వస్తే, కావాల్సినన్ని థియేటర్లు దొరికి.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేసే అవకాశముంటుంది.