అల్లు అర్జున్ వద్దు.. మంచు విష్ణు ముద్దు...

కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ (Allu Arjun) పేరు వింటేనే మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మీదట థియేటర్లలో అల్లు అర్జున్ సినిమాలు చూసేది లేదని చెబుతున్నారు. అయితే ఈ గొడవ.. అసలు దీనితో ఎటువంటి సంబంధం లేని, మంచు విష్ణు (Manchu Vishnu) పాలిట వరంలా మారే అవకాశం కనిపిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప-2' (Pushpa 2) డిసెంబర్ 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే జరిగితే తెలుగునాట 'పుష్ప-2' వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే, డిసెంబర్ లోనే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) కూడా విడుదల కానుంది. దీంతో 'పుష్ప-2'కి బదులుగా 'కన్నప్ప'ని థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేస్తామని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

'కన్నప్ప'కి ఇప్పటికే ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే అందులో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడైతే.. తెలుగునాట 'కన్నప్ప' అదిరిపోయే వసూళ్లు రాబట్టే అవకాశముంది.