కరోనా వైరస్ చైనా ల్యాబ్లోనే పుట్టిందన్న శాస్త్రవేత్త ఖాతా క్లోజ్ చేసిన ట్విట్టర్

ప్రపంచాన్ని మృత్యువాకిట నిలిచేలా చేసిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ లోనే పుట్టిందని వెల్లడించిన చైనా శాస్త్రవేత్త లీ మెంగ్ యాన్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సస్పెండ్ చేసింది. ట్విట్టర్ నిబంధనలను అతిక్రమించింది అంటూ మెసెజ్ పెట్టిన ట్విట్టర్ ఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమె ఖాతాను సస్పెండ్ చేస్తున్నారో వెల్లడించలేదు.

 

కరోనా వైరస్ చైనా ల్యాబ్ లోనే తయారు అయ్యిందని ఇటీవలే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తనతో ఉన్నాయని చెప్పారు. అయితే ప్రాణభయంతో తాను చైనా నుంచి అమెరికా వెళ్ళిపోయానన్నారు.

 

గతంలోనూ కరోనా వైరస్ చైనానే తయారు చేసింది అని చెప్పిన శాస్త్రవేత్త మరణించారు. ఇప్పుడు మరో శాస్త్రవేత్త ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విదేశాల్లో బతుకుతున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రజలతో కనెక్ట్ కాకుండా ఖాతాను సస్పెండ్ చేయడం అమానుషం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.